Site icon NTV Telugu

iPhone Offers: ఐఫోన్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్

Iphone

Iphone

iPhone Offers: ఆపిల్ తాజాగా విడుదల చేసిన iPhone 17 Pro ప్రపంచవ్యాప్తంగా టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే, తక్కువ ధరలో అందుబాటులో ఉన్న iPhone 16 Pro ఇప్పటికీ వినియోగదారులకు మంచి ఎంపికగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల ధరలు, ఆఫర్లు, ముఖ్య ఫీచర్లపై ఓసారి లుక్ వేద్దాం..

Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

ధరలు, ఆఫర్లు
iPhone 17 Pro (256GB) అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కు లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు డిస్కౌంట్ ఉది. దీంతో ధర రూ.1,30,900కు తగ్గనుంది. ఈ ఫోన్ సిల్వర్, డార్క్ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు, iPhone 16 Pro ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,08,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,19,900 కాగా, కొన్ని బ్యాంక్ ఆఫర్లతో మరింత డిస్కౌంట్ లభించవచ్చు.

Read Also: Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

స్పెసిఫికేషన్స్, ఫీచర్లు
iPhone 17 Proలో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆపిల్ A19 Pro చిప్‌సెట్‌తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. కెమెరా విభాగంలో వెనుక భాగంలో మూడు 48 మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక, iPhone 16 Proలో కూడా 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ A18 Pro చిప్‌సెట్‌తో iOS 18పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌ను iOS 26.2 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.. వెనుక భాగంలో రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండగా, ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంది.

ఏది కొనాలి?
అయితే, ధర వ్యత్యాసం పెద్దగా పట్టించుకోని వినియోగదారులకు iPhone 17 Pro మెరుగైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో ఇది మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. అదే సమయంలో, తక్కువ ధరలో ప్రీమియం ఐఫోన్ అనుభవం కావాలనుకునే వారికి iPhone 16 Pro కూడా మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Exit mobile version