రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Apple Iphone 17 Pro, Pro Max

Apple Iphone 17 Pro, Pro Max

iPhone 17 Pro Discount: మన దేశంలో ఐఫోన్ ప్రియులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. కొత్త సిరీస్ లాంచ్ అయ్యిందంటే చాలు అప్పులు చేసి మరి ఎగబడి కొంటున్నారు. మీరు కూడా కొత్త ఐఫోన్ కొందామనుకుంటున్నారా? కానీ కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో ధర చూసి బాబోయ్ అనుకుని ఆగిపోయారా? అయితే మీకు ఒక మంచి వార్త. గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 17 ప్రో మోడల్స్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ డిజిటల్ ఒక అద్భుతమైన ఆఫర్‌ను మోసుకొచ్చింది. సరైన ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కనుక మీకు కుదిరితే, ఏకంగా రూ. 1,34,900 విలువైన ఐఫోన్ 17 ప్రో (256GB)ని కేవలం రూ. 56,990కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది! అదేంటంటే రూ. 56,990 అనేది నేరుగా తగ్గించిన ధర కాదు. అన్ని రకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు కలిపిన తర్వాత వచ్చే ఎఫెక్టివ్ ప్రైస్. కాబట్టి తొందరపడి స్టోర్‌కి వెళ్లేముందు ఈ ఆఫర్ లెక్కలేంటో, దానికి ఉన్న నిబంధనలేంటో క్లియర్‌గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు రూ. 1,34,900 ఐఫోన్ ధర రూ. 56,990 కి ఎలా తగ్గిందో ఇప్పుడు చూద్దాం.

ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్‌ను రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌లో దీనిపై మొదటగా రూ. 9,910 ఇన్-స్టోర్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఫోన్ ధర రూ. 1,24,990 కి తగ్గుతుంది. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 55,000 వరకు వాల్యూ పొందే అవకాశం ఉంది. దీనికి తోడు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తాయి. ఇవన్నీ కలిపి ఏకంగా రూ. 77,910 వరకు లబ్ధి చేకూరుతుంది. ఈ ఆఫర్లన్నీ పక్కాగా వర్తిస్తే రూ. 1.35 లక్షల ఫోన్ కాస్తా రూ. 56,990కే చేతికి వస్తుంది.

కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రూ. 55,000 ఎక్స్చేంజ్ వాల్యూ అనేది అందరి ఫోన్లకూ రాదు. రిలయన్స్ డిజిటల్ ఈ లెక్కను చెప్పడానికి ఐఫోన్ 15 ప్రో ఎక్స్చేంజ్ వాల్యూను ఉదాహరణగా తీసుకుంది. మీ దగ్గర ఉన్న పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌ను బట్టి ఎక్స్చేంజ్ ధర మారుతుంది. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ లేకపోయినా లేదా దాని ఎక్స్చేంజ్ వాల్యూ తక్కువ వచ్చినా, ఈ ఫోన్ రూ. 56,990 ధరకు రాదు. కాబట్టి మీ దగ్గర ఇప్పటికే పాత ఐఫోన్ ప్రో సిరీస్ ఫోన్ ఉండి, అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది నిజంగానే తిరుగులేని ఆఫర్ అని చెప్పొచ్చు. రిలయన్స్ డిజిటల్ తమ కస్టమర్ల కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత వస్తుందో ముందుగానే చెక్ చేసుకునే సదుపాయం కూడా ఇస్తోంది, కాబట్టి కొనేముందు మీ ఫోన్ వాల్యూ చెక్ చేసుకోవడం మంచిది.

కేవలం ఐఫోన్ 17 ప్రో మాత్రమే కాదు, పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) పై కూడా సరిగ్గా ఇలాంటి ఆఫరే ఉంది. రూ. 1,49,900 లాంచ్ ధర ఉన్న ఈ ప్రో మాక్స్ మోడల్‌పై రూ. 9,910 ఇన్-స్టోర్ డిస్కౌంట్ పోను ధర రూ. 1,39,990 కి వస్తుంది. దీనిపై కూడా రూ. 55,000 వరకు ఎక్స్చేంజ్ వాల్యూ, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అప్లై చేస్తే, ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 71,990 కి చేరుకుంటుంది. కాబట్టి ప్రో మాక్స్ మోడల్ వైపు చూస్తున్న వారికి కూడా ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.