Site icon NTV Telugu

Iphone 17 Pre Booking: ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ప్రారంభం.. ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత చెల్లించాలో తెలుసా?

Iphone 17 Pre Booking

Iphone 17 Pre Booking

అమెరికా దిగ్గజ సంస్థ ‘యాపిల్’ ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్‌ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. మరింత మన్నిక, డిజైన్‌ మెరుగుదల, మెరుగైన పనితీరుతో ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించింది. ఇక భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రీ-ఆర్డర్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, అందుకు ఎంత చెల్లించాలి అనే డీటెయిల్స్ చూద్దాం.

కస్టమర్లు యాపిల్ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ప్రధాన రిటైలర్‌ల ద్వారా ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్ (క్రోమా), విజయ్ సేల్స్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో అందుబాటులో రానుంది. అమెజాన్‌లో అయితే ఇప్పటివరకు ఏ ఆప్షన్ లేదు. డెలివరీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ప్రీ-బుకింగ్ కోసం రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం రూ.17,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ప్రీ-బుక్ సమయంలో బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ట్రేడ్-ఇన్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రీ-డీల్స్యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికను కూడా పొందవచ్చు. ఆపిల్ ట్రేడ్-ఇన్ కింద మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.

Also Read: iPhone 16 Pro Price: యాపిల్ లవర్స్‌ ఎగిరి గంతేసే న్యూస్‌.. ఐఫోన్‌ 16 ప్రోపై రూ.43 వేల తగ్గింపు!

ముందస్తు ఆర్డర్ కోసం:
1. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్, యాపిల్ ప్రీమియం రీసెల్లర్లు
2. రిలయన్స్ డిజిటల్, క్రోమా)
3. విజయ్ సేల్స్ స్టోర్లు
4. అమెజాన్ (ప్రస్తుతం అందుబాటులో లేదు)
5. ఫ్లిప్‌కార్ట్ ( త్వరలో)

ఐఫోన్ 17 సిరీస్, ప్రీ-బుకింగ్ ధర:
1. ఐఫోన్ 17 ధర రూ. 82,900 – ప్రీ-బుకింగ్ కోసం రూ.2,000
2. ఐఫోన్ ఎయిర్ ధర రూ. 1,19,900 – ప్రీ-ఆర్డర్ కోసం రూ.2,000
3. ఐఫోన్ 17 ప్రో బేస్ వేరియంట్ ధర రూ.1,34,900 – ప్రీ-ఆర్డర్ కోసం రూ.17,000
4. ఐఫోన్ 17 ప్రో మాక్స్ బేస్ వేరియంట్ ధర రూ.1,49,900 – ప్రీ-బుకింగ్ కోసం రూ.17,000

 

Exit mobile version