Iphone 16 Launch Today: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు ‘యాపిల్’ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియా ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో యాపిల్ కంపెనీ వెబ్‌సైట్, ఆపిల్ టీవీ, యాపిల్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ సహా యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. మునుపటి మాదిరే 16 సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను యాపిల్ ప్రకటించనుంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ యాక్షన్ బటన్‌ను ఇచ్చారు. 16 సిరీస్‌లో అన్నిమోడళ్లు లేటెస్ట్ జెన్ హార్డ్‌వేర్, ఏఐతో రానున్నాయి.
Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఆ ఇద్దరు భారత స్టార్లకు అవకాశం ఎందుకు దక్కలేదంటే?
గతంతో పోలిస్తే 16 సిరీస్‌లో అప్‌గ్రేడ్‌లతో కెమెరాలు రానున్నట్లు తెలుస్తోంది. ప్రైమరీ కెమెరా 1x, 2x జూమ్‌తో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో రానుంది. దీని సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 0.5x జూమ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ధర గురించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ అమెరికాలో ఐఫోన్ 16 ధర రూ.67,100గా.. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.75,500గా ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో రూ.92,300గా.. హై ఎండ్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.1,00,700గా ఉండనుంది. ఈ ధరలు భారత్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు, అదనపు ఖర్చుల కారణంగా భారతీయ కొనుగోలుదారులు అధిక ధర పెట్టాల్సి ఉంటుంది.