యాపిల్ సంస్థ ఏటా కొత్త సిరీస్ ఐఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టాప్ రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఐఫోన్ 14ను మించిన సరికొత్త సిరీస్‌లో ఉంటాయని టెక్ రిపోర్ట్స్ తెలిపింది. ఈ సిరీస్‌లోని ఐఫోన్ 15 ప్రో మోడల్స్, అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కెపాసిటీతో మార్కెట్ లోకి రానున్నట్లు తాజాగా లీక్స్ చెబుతున్నాయి. వీటిలో హై స్పీడ్ వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం సరికొత్త Wi-Fi 6E టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం.
Read Also: Husband Caught Wife Cheating: ఢిల్లీ మెట్రోలో ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. రివర్స్‌లో దాడి
ఐఫోన్ 15 ప్రో మోడల్ ఫోన్స్ Wi-Fi 6E టెక్నాలజీతో మార్కెట్ లోకి వస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం షేర్ చేసినట్లు యాపిల్ ఇన్‌సైడర్ రిపోర్ట్ తెలిపింది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ విశ్లేషకుల రిసెర్చ్ నోట్ కూడా ఈ పుకార్లు నిజమేనని చెప్పింది. డబ్ల్యూఐ-ఎఫ్ఐ6, డబ్ల్యూఐ-ఎఫ్ఐ6ఈ ప్రో (Wi-Fi 6, Wi-Fi 6E) రెండూ వైర్‌లెస్ టెక్నాలజీలో కొత్త అప్‌గ్రేడ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఇవి విభిన్న స్పెక్ట్రమ్‌లను, యూజర్ కేస్‌లను అందించనున్నాయని నివేదిక వెల్లడించారు.
Read Also: Rhea Chakraborty: దేశీ ‘బార్బీ’నంటూ పింక్ శారీలో అందాలు ఆరబోస్తున్న రియా చక్రవర్తి
ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. అయితే వీటిలో డబ్ల్యూఐ-ఎఫ్ఐ6ఈ టెక్నాలజీని యాపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లకే పరిమితం చేస్తుందని విశ్లేషకులు చెప్పారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ డబ్ల్యూఐ-ఎఫ్ఐ6 స్టాండర్ట్ టెక్నాలజీతో వస్తున్నాయని తెలిపారు. డబ్ల్యూఐ-ఎఫ్ఐ6 ట్రెడిషనల్ 2.4 GHz, 5 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌లలో పని చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇది ఈ బ్యాండ్‌లలో డేటా ట్రాన్స్‌మిషన్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. స్ట్రీమింగ్, గేమింగ్ వంటి యాక్టివిటీస్‌కు ఇది అనుకూలంగా ఉంది. డబ్ల్యూఐ-ఎఫ్ఐ6ఈ మాత్రం 6 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఆపరేటింగ్‌ని ఇంట్రాడ్యూస్ చేసింది. డబ్ల్యూఐ-ఎఫ్ఐ6 సామర్థ్యాలను విస్తరించింది.
Read Also: Bus Accident: ఘోర ప్రమాదం.. చెరువులో పడిన బస్సు, 17 మంది దుర్మరణం
అయితే, ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. యాపిల్ కొత్తగా డెవలప్ చేసిన ఆల్వేస్ ఆన్, ప్రోమోషన్ వంటి డిస్‌ప్లే ఫీచర్లను ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు పరిమితం చేస్తుందని వార్తులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండు మోడల్స్ లో టైటానియం ఫ్రేమ్, సాలిడ్ స్టేట్ బటన్లు, ర్యామ్ ఎక్కువగా, హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం థండర్‌బోల్ట్ పోర్ట్ వంటి కొత్త ఫీచర్లే ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. అలాగే అనుకున్న టైం కంటే ఒక నెల లేట్ గా కొత్త సిరీస్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై యాపిల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.