Site icon NTV Telugu

iPhone 15 Pro Max: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్!

Iphone 15 Pro Max Price Drop

Iphone 15 Pro Max Price Drop

iPhone 15 Pro Max Price Cut: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్ సెప్టెంబర్‌ 27న ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (256 జీబీ) ధర రూ.1,21,999గా ఉంది. లాంచ్ ధర కంటే ఇప్పుడు రూ.13 వేలు తక్కువగా ఉంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,26,999గా ఉంది. యాపిల్ కంపెనీ ఈ ఫోన్‌ను రూ.1,54,900తో లాంచ్ చేసింది. యూపీఐ చెల్లింపులపై 4 వేల వరకు ఫ్లాట్ తగ్గింపు ఉంది. సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుపై 3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అలానే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. 59 వేల ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. దాంతో మీరు చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సొంతం చేసుకోవచ్చు.

Exit mobile version