Apple iPhone 15 Launch Date Confirmed: యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్‌లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rohit Sharma: ఆ కారణంతోనే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నా: రోహిత్ శర్మ
Apple iPhone 15 Launch Date:
సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై యాపిల్ కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాపిల్ తన ఉత్పత్తులను మార్కెట్‌లో రిలీజ్ చేసే ముందు ఓ ప్రత్యేక కార్యక్రమంను నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 సిరీస్ కోసం కుపెర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ప్రత్యేక కార్యక్రమంను ఏర్పాటు చేసిందని సమాచారం తెలుస్తోంది.
Apple iPhone 15 Price:
భారతదేశంలో ఐఫోన్ 15 ధర దాదాపుగా రూ. 80,000 ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇప్పటివరకు యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 ధర గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ధర బేస్ మోడల్‌కు ఉండవచ్చు. ఫీచర్లు మరియు కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి ధర పెరుగుతుంది. ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల ధరలు లక్ష్య పైనే ఉండనున్నాయి.
Apple iPhone 15 Camera:
ఐఫోన్ 15 6.1 ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తోంది. అన్ని మోడళ్లలో డైనమిక్ ఐలాండ్-స్టైల్ డిస్‌ప్లేలు ఉంటాయట. ఐఫోన్ 15 మునుపటి కంటే మెరుగైన ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త సిరీస్‌లో A16 బయోనిక్ చిప్‌సెట్ కూడా ఉంటుందని సమాచారం. 48-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఐఫోన్ 15 కలిగి ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంకేం మార్పులు తీసుకొస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Also Read: Sanju Samson Jersey: భారత్-వెస్టిండీస్ తొలి వన్డేలో సంజూ శాంసన్.. గందరగోళానికి గురైన ఫాన్స్!