NTV Telugu Site icon

Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం..ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కారం

Abhinav Bindra

Abhinav Bindra

భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది. ఒలింపిక్స్ ముగియడానికి ఒక రోజు ముందు పారిస్‌లో జరిగే 142వ ఐఓసీ సెషన్‌లో ఆయనకు ఈ గౌరవం
ఇవ్వబడుతుంది. అంతకుముందు.. 1983లో దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఈ అవార్డుతో సత్కరించారు.

READ MORE: Nagarjuna Sagar: సాగర్‌ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..

1975లో స్థాపించబడిన ఒలింపిక్ ఆర్డర్..
ఒలింపిక్ లో అత్యున్నత పురస్కారం. ఒలింపిక్స్ సమయంలో లేదా దానికి సంబంధించి విశిష్ట సహకారం అందించినందుకు ఇది ఇవ్వబడుతుంది. అంటే.. క్రీడలను ప్రోత్సహించడానికి విలువైన ప్రయత్నాల ఆధారంగా వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ సారి భారత్ కు చెందిన అభినవ్ బింద్రాకు ఈ అవకాశం రావడం భారత క్రీడాకారులకు గౌరవం. ఐఓసీ ప్రతి ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో ప్రధాన జాతీయ నిర్వాహకులకు ఒలింపిక్ ఆర్డర్‌ను ప్రదానం చేస్తుంది.

READ MORE:AP Anti Narcotic Task Force: డ్రగ్స్, గంజాయి కట్టడికి చర్యలు.. APNTF ఏర్పాటుకు కసరత్తు..

ఒలింపిక్ ఆర్డర్ హానర్ అంటే ఏమిటి?
ఒలింపిక్ ఆర్డర్ అనేది ఐఓసీ యొక్క అత్యున్నత పురస్కారం. ఇది ఒలింపిక్ ఉద్యమంలో విశిష్ట కృషికి అందించబడుతుంది. ఒలింపిక్ ఆదర్శాన్ని ప్రతిబింబించిన, క్రీడా ప్రపంచంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన.. క్రీడల అభివృద్ధికి తన సహకారం అందించిన వ్యక్తిని గౌరవించటానికి దీనిని ప్రదానం చేస్తారు. దీని నామినేషన్లను ఒలింపిక్ ఆర్డర్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యక్తిని ఎంపిక చేస్తుంది.

READ MORE:Paris Olympics 2024: నేడు భారత్ కు ఏడో పతకం రావొచ్చు..భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..

బింద్రా 2008లో స్వర్ణం..
41 ఏళ్ల బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించారు. భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించారు. 2010 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) యొక్క అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ సభ్యుడి ఉన్నారు.

Show comments