IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 15 లోపల చెల్లించవచ్చు. బ్యాంక్ మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అప్రెంటిస్‌షిప్ వ్యవధి 1 సంవత్సరం ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు కనీస వయస్సు 20 సంవత్సరాలు. గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. OBC కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 3 సంవత్సరాలు. అలాగే SC, ST లకు 5 సంవత్సరాల సడలింపు ఇవ్వబడింది. ఇక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ.944గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 708 దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వికలాంగులకు దరఖాస్తు రుసుము రూ. 472 గా నిర్ణయించారు. అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు CBT పరీక్ష, భాషా పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కోసం, అభ్యర్థులు బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి..
* iob.in బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
* వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.
* దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి.