Site icon NTV Telugu

Hyderabad: పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డి పట్టివేత..

Ccs Police

Ccs Police

పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి స్టేషన్ నుంచి నాగిరెడ్డి పారిపోయిన విషయం తెలిసిందే. చోరీ కేసులో అరెస్ట్ అయిన తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డి. విచారణ కోసం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకు వచ్చారు. వాష్ రూమ్ పేరుతో స్టేషన్ బాత్రూం నుంచి బయటికి వెళ్లి పరారయ్యాడు నాగిరెడ్డి. నాగిరెడ్డి పరారితో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. నాగిరెడ్డి పరారీ ఘటనలో ఎస్ఐకి ఛార్జ్ మెమో, హోంగార్డ్ అటాచ్ చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరపూర్ కి చెందిన నాగిరెడ్డి. నాగిరెడ్డి పై వందకు పైగా దొంగతనం కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version