NTV Telugu Site icon

Cricket Tournament: పంచె కట్టుకొని క్రికెట్‌ ఆడిన పూజారులు.. కాలక్షేపానికి కాదండోయ్‌..!

Cricket Tournament

Cricket Tournament

Cricket Tournament: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం అంబాజీపేటలో అంతరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అంబాజీపేట జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో అంతర్రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరగగా.. పురోహిత జట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పంచెలు కట్టుకొని బ్రాహ్మణ పురోహితులు క్రికెట్ ఆడారు. నిత్యం గుళ్లలో పూజలు, వ్రతాలు పెళ్లిళ్లు చేసే పూజారులు.. పంచె కట్టి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లో క్రికెట్ ఆడారు. పంచెకట్టులో క్రికెట్ ఆడటానికి స్కూల్ పిల్లలు, స్థానికులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించడానికి కారణం లేకపోలేదు. పౌరోహిత్యాన్ని పెంచడం కోసం నిర్వాహకులు ఈ క్రికెట్‌ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు.