Manipur: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్‌లో కలహాల నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది. జులై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెట్టింట ఆ ఫొటోలు వైరల్ అయిన నేపథ్యంలో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
Also Read: Interpol: ఖలిస్తాన్ ఉగ్రవాది కరణ్వీర్ సింగ్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
మణిపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ డేటా సేవల ఇంటర్నెట్/డేటా సేవల తాత్కాలిక సస్పెన్షన్/నియంత్రణ అక్టోబర్ 1వ తేదీ రాత్రి 7:45 గంటల వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. మంగళవారం ఇంఫాల్‌లో భారీ ప్రజల ఆగ్రహాన్ని అనుసరించి, ఇద్దరు మెయిటీ టీనేజర్ల మృతదేహాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో, మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై తాత్కాలిక పరిమితిని ఆదేశించింది.
జాతుల మధ్య నెలకొన్న వైరంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో మణిపూర్‌లో ప్రభుత్వం గతంలో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే ఇటీవల పరిస్థితులు సద్దమణగడంతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల మృతదేహాల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండు ఫొటోలు వైరల్ కాగా.. అందులో ఒక ఫొటోలో కొంత మంది సాయుధులు వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి ఉంచగా.. వారి వెనుక సాయుధులు కన్పిస్తున్నారు. ఆ ఫోటోలో విద్యార్థులు ఇద్దరు గడ్డిపై కూర్చుకున్నారు. మరో ఫోటోలో విద్యార్థుల మృతదేహాలను పొదల మధ్యలో పడవేసి కన్పించింది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!