Site icon NTV Telugu

International Yoga Day: నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం..

Modi

Modi

నేడు యోగా దినోత్సవాన్ని ఈ ప్రపంచమంతా జరుపుకుటుంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు దేశాల్లో సైతం యోగా దినోత్సవానికి ఆయా దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటు భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది.

Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

భారత్ లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అందరూ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. పార్కుల్లో.. పలు స్టేడియాల్లో యోగా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పేర్కొనింది. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించింది. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా అని పేర్కొంది.

Read Also: Narasimha swami: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి

భారత ప్రభుత్వం 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోడీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది. అయితే, ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది.. అది ఏంటంటే.. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21వ తేదీ ప్రత్యేకత అని పేర్కొంటున్నారు.

Exit mobile version