NTV Telugu Site icon

Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధానిపై అరెస్టు వారెంట్లు జారీ

Isreal

Isreal

Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్‌ గల్లాంట్‌తో పాటు పలువురు హమాస్‌ నేతలపైనా వారెంట్లు ఇష్యూ చేసింది. బెంజమిన్, గల్లాంట్‌ గాజాలో మారణ హోం కొనసాగించారని.. మానవత్వం లేకుండా దాడి చేశారని ఐసీసీ పేర్కొనింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం లాంటి దారుణమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా, గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా కఠిన ఆంక్షలు విధించారని.. అమాయక ప్రజల మరణానికి కారణమయ్యారని అంతర్జతీయ క్రిమినల్ కోర్టు మండిపడింది.

Read Also: PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

ఇక, బెంజమిన్ నెతన్యాహు, గల్లాంట్‌ చర్యల వల్ల ఎంతో మంది మహిళలు, చిన్నారులు చనిపోయారని ఇంటర్ నేషనల్ క్రిమినల్ కోర్టు పేర్కొనింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసి పిల్లలు మృతి చెందారని పేర్కొంది. వీరు ఇద్దరు ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి అన్ని ఆధారాలను గుర్తించామని చెప్పుకొచ్చింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, గల్లాంట్‌ బాధ్యత వహించాలని వెల్లడించింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్పష్టం చేసింది.

Read Also: Astrology: నవంబర్ 22, శుక్రవారం దినఫలాలు

అయితే, గాజాలో 2023 అక్టోబర్‌ 8 నుంచి 2024 మే 20వ తేదీ వరకు నెలకొన్న విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు తెలిపింది. అందులో భాగంగానే.. నెతన్యాహు, గల్లాంట్‌లతో పాటు హమాస్‌ అగ్రనేతలు మహ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ తెలిపింది. కాగా, ఇప్పటికే యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియే ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయారు. మరోవైపు, ఇజ్రాయెల్‌ ప్రధాని, రక్షణ శాఖ మాజీ మంత్రికి అరెస్టు వారెంట్లు ఇవ్వడంతో.. ఏం జరుగుతుందన్న చర్చ స్టార్ట్ అయింది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్‌లు నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి సపోర్టు ఇవ్వకూడదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్‌ ఏకాకి అవుతారు. లాస్ట్ కి గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ స్టార్ట్ చేయాలనే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.