NTV Telugu Site icon

Inter Student: ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Inter

Inter

Inter Student: హనుమకొండ నగరంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది..హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాలేజీలో బిపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాహితీ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి ఘటన జరిగినా.. శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించకుండా నేరుగా పోస్ట్‌మార్టం తరలించాక సమాచారం ఇచ్చారని , విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. అయితే ఇంటర్ విద్యార్థి చేతికి కట్ చేసుకున్న తలభాగాలు దెబ్బలు తగిలి ఉండడం వారి అనుమానాలకు కారణం అవుతున్నాయి విద్యార్థి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శివరాత్రి వేళ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య గట్ల కనపర్తి గ్రామంలో విషాదఛాయలు అల్లుకున్నాయి