మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమార్కుడు.. రవితేజ మార్కెట్‌ను అమాంతం పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఇందులో అత్తిలిసత్తిబాబు అనే దొంగగా మరియు విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో పవర్‌ఫుల్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ అదరగొట్టాడు. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరోగా మారారు.దాదాపు 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ అప్పట్లోనే 23 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. 2006లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు 2 సినిమా చేయాలన్నది కోరిక అంటూ గతంలో ఓ మూవీ ప్రమోషన్స్‌లో రవితేజ కూడా తెలిపారు.తాజాగా విక్రమార్కుడు సీక్వెల్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
విక్రమార్కుడు సీక్వెల్‌కు సంబంధించి కథ మొత్తం సిద్ధమైనట్లు భీమా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ తెలిపారు.. విక్రమార్కుడు సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ ఈ సీక్వెల్ స్టోరీని రెడీ చేసినట్లు రాధామోహన్ తెలిపారు.విక్రమార్కుడు 2 టైటిల్‌ను మూడేళ్ల క్రితమే తమ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు..అయితే విక్రమార్కుడు 2 మూవీకి దర్శకుడు రాజమౌళి కాదు.. దర్శకుడు సంపత్‌నందితో ఈ సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశామని రాధామోహన్ తెలిపారు.. కానీ విక్రమార్కుడు సీక్వెల్‌లో నటించడానికి రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాము.రవితేజ ఒప్పుకుంటేనే సీక్వెల్ మొదలుపెడతాము.సరైన కాంబినేషన్ సెట్‌కాకపోతే ఈ సీక్వెల్ చేయము అని ఆయన తెలిపారు.విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ రావాలని విజయేంద్రప్రసాద్ కూడా కోరుకుంటున్నారు అని కేకేరాధామోహన్ తెలిపారు.రవితేజ, సంపత్ నంది తమ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో సీక్వెల్ ఆలస్యమవుతోందని రాధామోహన్ చెప్పుకొచ్చారు..