NTV Telugu Site icon

Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?

Pavitraaa

Pavitraaa

ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్, నటి పవిత్ర పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. అభిమానిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసు విచారణలో పోలీసులు నమ్మలేని నిజాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.. దర్శన్, పవిత్రలు గత పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అభిమాని పవిత్రకు అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

అయితే అసలు కేసు గురించి పక్కన పెట్టి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ తెగ గూగుల్ లో వెతికేస్తున్నారు.. ఆమె పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ పుట్టింది? హీరోతో పరిచయం ఎలా ఏర్పడింది? పెళ్లి అయ్యిందా? పిల్లలు ఎంతమంది? అసలు ఆమె భర్త ఏం చేస్తారు అనే విషయం పై తెగ ఆరా తీస్తున్నారు.. ఈ క్రమంలో చాలా మంది ఆమె మొదటి భర్త గురించి వెతుకుతున్నారు..

పవిత్ర మొదటి భర్త పేరు సంజయ్ సింగ్‌.. ఆమెకు 18 ఏళ్ల వయసులో ఉండగానే పెళ్లి చేశారు. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్‌ సింగ్‌తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్‌తో రిలేషన్‌లో ఉన్నారు.. ఈ మధ్యే వీరిద్దరి క్లోజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అయితే ఈమె కన్నడ సినిమాలతో పాటుగా, తమిళ్ చిత్రాల్లో కూడా నటించింది..

Show comments