NTV Telugu Site icon

AP Election Results 2024: తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికర చర్చ..! ఓటమికి కారణం అదేనా..?

Tpt Bjp

Tpt Bjp

AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటింది కూటమి.. అయితే, నమ్మకంలేని స్థానాల్లో విజయం సాధించినా.. గెలుస్తాం అనుకున్న కొన్ని స్థానాలు కోల్పోవడంతో అసలు ఏం జరిగింది? అనేదానిపై ఫోకస్‌ పెడుతున్నారు నేతలు.. ఇక, తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.. అభ్యర్ధిగా వరప్రసాద్ ఎంపికే ఓటమి కారణంగా నిర్ణయానికి వచ్చారు స్థానిక నేతలు.. ఇక అత్యధికంగా గూడురులో 24 వేలకుపైగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు లెక్కలు వేస్తున్నారు.

Read Also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

కాగా, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ విజయం సాధించింది.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మద్దిల గురుమూర్తి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి చెందిన బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌పై గెలుపొందారు.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ గురుమూర్తి మరియు రిటైర్డ్ బ్యూరోక్రాట్ అయిన వరప్రసాద్ ఇద్దరూ గతంలో తిరుపతి లోక్‌సభ స్థానానికి పనిచేశారు. అయితే, ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి.. పార్లమెంట్‌ సీటు ఓడిపోవడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.