NTV Telugu Site icon

Devara 2 : దేవర 2 ప్లానింగ్ అంతా మార్చేసిన కొరటాల

New Project (57)

New Project (57)

Devara 2 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా వారం దాటినా కలెక్షన్ల పరంగా సంచలన రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లపై మాత్రం ప్రభావం చూపలేదు. సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలివచ్చారు. ఫలితంగా ఈ సినిమా రూ. వారానికి 405 కోట్లు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ దసరా సెలవుల్లో వచ్చేవన్నీ లాభమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

Read Also:Bathukamma Tangedu Flowers: బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులకు సంబంధం ఏమిటి?

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక పార్ట్ 1 కాస్త నిరాశ పరచడంతో పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినీ వర్గాల్లో దేవర పార్ట్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read Also:Crime News: మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు

దీనితో దేవర పార్ట్ 2 లో కొరటాల ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన నేపథ్యానికి పూర్తిగా భిన్నమైన బ్యాక్ డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో వచ్చే యాక్షన్ బ్లాక్ లు కూడా అదిరిపోతాయని సమాచారం. ఇక దీనితో పాటుగా పార్ట్ 2 రావడానికి 2027 చివరలో లేదా 2028 వరకు ఆగాల్సిందే అన్నట్టు వినిపిస్తోంది. మరి మొత్తానికి అయితే పార్ట్ 2 పట్ల మరిన్ని స్పెషల్ ప్లానింగ్ లు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Show comments