NTV Telugu Site icon

RBI Governor: లోన్లు తీసుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్.. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడి

Rbi Governor

Rbi Governor

ద్రవ్యోల్భణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఇవి ఎంత కాలం ఉంటాయనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక కామెంట్స్ చేశారు. అయితే, ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2023లో ఇప్పటి వరకు పాలసీ రేట్లపై ఆర్బీఐ విరామం కొనసాగించిందని అన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని తెలిపారు. ఇవాళ జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచేశాయి. ఈ క్రమంలో ఆర్బీఐ సైతం గతేడాది మే నెల నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును కూడా పెంచింది.

Read Also: Health tips: డైయాబెటిస్ ని అదుపులో ఉంచే వెల్లుల్లి ఊరగాయ.. తయారీ విధానం

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు అని ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. ఆర్బీఐతో సహ సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని శక్తికాంత్ దాస్ సూచించారు.

Read Also: Saptasagaralu Daati Side B: సూపర్ హిట్ మూవీ .. సీక్వెల్ డేట్ వచ్చేసింది

ప్రస్తుతం.. క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం లాంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పుకొచ్చారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఐనా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవని చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని ఆయన అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

Show comments