NTV Telugu Site icon

Inter State Thief Arrest: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. టైర్లు, కాపర్ బాక్సుల చోరీ

Psycho Arrest

Psycho Arrest

దొంగతనాలు చేయడం ఒక కళ. దొంగలు తమ కళకు మరింత మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. ఏపీలోని అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా ఎదుట హాజరు పరిచారు.

Read Also: NIA Searches: ఐసిస్, అల్-ఖైదాతో సంబంధాలు.. ముంబై, బెంగళూరులో సోదాలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన ధన కుమార్ అనే నిందితుడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరస చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇతని పై గతంలో కూడా 7 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఓ కేసు దర్యాప్తులో మొలకలచెరువు సీఐ సాధిక్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ. 14 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన 16 టైర్లు, 400 కేజీలు బరువు గల 25 కాపర్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక బొలెరో లగేజీ వాహనం ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు వివరించారు. నిందితుడి అరెస్ట్ చేసిన మొలకలచెరువు సీఐ సాధిక్ అలీ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ అభినందించారు.

Read Also: Positive News From Adani Group: అదానీ అంటే అదనే కాదు.. ఇదీనూ..