Site icon NTV Telugu

Inter Exams : నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే

Inter Exams

Inter Exams

తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ)-2023 మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) వెల్లడించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత లోపలికి అనుమతించరు. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు… 61 సెల్ఫ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు.

Also Read : Phalguna Masam 2023 Wednesday Special: బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది

ఏపీలోనూ నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనుండగా.. సెకండియర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. అయితే.. పరీక్షా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక విద్యార్ధులు హాల్ టికెట్ల కోసం జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఏ కళాశాలైన విద్యార్థులకు హాల్ టికెట్ పంపిణీకి ఫీజు డిమాండ్ చేస్తే తక్షణమే 18004257635 ట్రోఫీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1489 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 10,03,990 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,84,197 కాగా, సెకండియర్ విద్యార్ధులు 5,19,793గా ఉన్నారు.

Also Read : Murder : డ్రములో డెడ్ బాడీ.. రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన

Exit mobile version