NTV Telugu Site icon

Telangana Inter board: హిట్లర్ను మించిపోతున్న ఇంటర్ బోర్డు అధికారులపై జేఏసీ చైర్మన్ ఆరోపణలు..

Inter Board

Inter Board

ఇంటర్ బోర్డు అధికారుల దౌష్టికం రోజురోజుకు పెరిగిపోతుంది అని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్య మండలిలో తిష్ట వేసిన అధికారుల యొక్క నిర్ణయాలు ఇంటర్ అధ్యాపకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు. ఇక, ఇంటర్ బోర్డులో అడ్వాన్స్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యూషన్ కి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే క్రమంలో ఇచ్చినటువంటి నియామక పత్రాల్లో గెస్ట్ అధ్యాపకులను తొలగించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బోర్డులో ఉన్నటువంటి నియమాల నిబంధనల పట్ల ఆరు నెలలైనా ఇంకా ఏబీసీడీలు కూడా నేర్చుకోలేదనే విషయం నాకు అర్థమవుతుంది అంటూ మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Read Also: Hyderabad: మియాపూర్లో దారుణం.. ఆరేళ్ల బాలుడిని పీక్కుతిన్న కుక్కలు

తాజాగా ప్రభుత్వం నుంచి పునర్ నియామక ఉత్తర్వులు రాలేదు కాబట్టి 1654 మంది అతిథి ఆధ్యాపకులను మూల్యాంకన కేంద్రాల్లో అడుగుపెట్టనీయొద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి హుకుం జారీ చేయడమే కాకుండా వారి నియామక పత్రాలను రద్దు పరిచారని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 800 నుంచి 1000 ప్రైవేటు కళాశాలలకు ఇంకా అనుబంధ కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు.. అనుబంధ గుర్తింపు ఇచ్చే అధికారం కూడా ప్రస్తుతం మీకు లేదు శృతి ఓజా.. ప్రభుత్వం మినహింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప మీరు ఏమి చేయలేరని ఆయన చెప్పుకొచ్చారు. మరి అనుమతి లేని కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు మీకు ముద్దు ఎలా అయ్యారు.. గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ అతిధి అధ్యాపకులు శత్రువులు ఎలా అయ్యారని ప్రశ్నించారు.

Read Also: India Alliance Meeting: సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఎం నిర్ణయంతీసుకోబోతున్నారు

ఇంటర్ బోర్డులో కార్యదర్శిగా శృతి ఓజా విధులు నిర్వహించేటటువంటి సామర్ధ్యం కానీ, తెలివితేటలు గానీ.. మీకు ఉన్నట్లుగా కనిపించడం లేదు ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తక్షణం ఇంటర్ విద్య మండలి సెక్రెటరీని తప్పించి ఏదైనా ఒక విభాగానికి బదిలీ చేసి ఇంటర్ బోర్డును కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. అతిథి ఆధ్యాపకుల పైన నవీన్ మిట్టల్ హయాంలో కొనసాగిన అక్కస్సు ఇంకా కూడా కొనసాగడం విచారకరం.. గెస్ట్ ఆధ్యాపకులపై ఇలాంటి వివక్షను కొనసాగించే ప్రయత్నం చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులకు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.