వచ్చే ఏడాదికి సంబంధించి ఇంటర్ కాలేజీలకు అఫిలియేషన్ పొడిగించింది ఏపీ ఇంటర్ బోర్డు. అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. మొదట ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. పలు కాలేజీల అభ్యర్థనల మేరకు పొడిగించినట్లు పేర్కొంది ఇంటర్ బోర్డు. రూ.10వేల ఫైన్‌తో ఈనెల 24 నుంచి 30 వరకు దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపింది. కాలేజీల్లో RIOల ఇన్స్పెక్షన్లు డిసెంబర్ 15 నుంచి జనవరి 3 వరకు కొనసాగుతాయని పేర్కొంది. అయితే.. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
Also Read : Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
ఈమేరకు సవివరమైన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి గత నోటిఫికేషన్‌లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
