Russia Syria HTS Hama Attack: ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీని తరువాత హెటీఎస్ తిరుగుబాటుదారుల లక్ష్యం టార్టస్, ఇక్కడ రష్యన్ సైన్యం దాని నావికా స్థావరాన్ని నిర్మించింది. రష్యా వైమానిక దాడుల సాయంతో తామున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెనక్కి నెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టేందుకు సిరియా సైన్యం కూడా ఎదురుదాడులు జరుపుతోంది. తుర్కియే-మద్దతుగల తిరుగుబాటుదారులు ఏ సమయంలోనైనా ఖ్మీమిమ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌బేస్‌ను 2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ రష్యాకు ఇచ్చారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు, తిరుగుబాటు దళాలకు గత 13 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ పోరు ఇటీవల దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన అలెప్పోను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో మళ్లీ తీవ్రమైంది.
Read Also: Recharge Plan: మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
దీని తరువాత, రష్యా సహాయంతో సిరియా అంతర్యుద్ధంలో అసద్ ప్రభుత్వం పైచేయి సాధించింది. హమా సిరియాలో నాల్గవ అతిపెద్ద నగరం. బుధవారం, రష్యా సైన్యం బలమైన వైమానిక దాడిని ప్రారంభించింది. హమా నగరాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్ భద్రత కోసం హమాను అస్సాద్ సైన్యం స్వాధీనం చేసుకోవడం అవసరం. ఇది మాత్రమే కాదు, టార్టస్, లటాకియా తీరప్రాంత నగరాలకు హమా ప్రవేశ ద్వారం. హమాలో రష్యా సైన్యానికి నావికా స్థావరం ఉంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలిటెంట్లు సిరియా ప్రభుత్వానికి అండగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, ఈ పోరాటం కారణంగా వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి గార్ పెడెర్సన్ తెలిపారు.