Site icon NTV Telugu

Instagram Love : ఇన్ స్టాగ్రామ్‎లో లవ్.. యూట్యూబ్ చూసి డెలివరీ

Instagram

Instagram

Instagram Love : ఓ టీనేజ్ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడ్డ యువకుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. యూట్యూబ్ సాయంతో బాలిక ఇంట్లోనే ప్రసవించింది. ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక కుటుంబ సభ్యులు పెద్ద షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఓ నవజాత శిశువు మృతి చెందింది. నిందితుడిపై బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాగ్‌పూర్ పోలీసులు యువతి సోషల్ మీడియా ఖాతా నుండి యువకుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ ఉదంతం నాగపూర్ ప్రాంతంలో కలకలం రేపింది.

Read Also: Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు

అసలేం జరిగిందంటే.. తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు ఆమెను కలిశాడు. ఇద్దరూ ఒక్కడవడంతో ఆమె గర్భం దాల్చింది. ఇది ఇంట్లో ఎవరికీ తెలియకుండా 15 ఏళ్ల మైనర్ ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సాయంత్రం బాలిక తల్లి ఇంటికి రాగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మాయో ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు సమాచారం అందించారు. ఆ తర్వాత బాధిత బాలిక జరిగిన మొత్తం తన తల్లికి చెప్పింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా లభించిన నేమ్ ఐడీ ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేశారు. అంబజారి పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. యూట్యూబ్ చూసి బాలిక ప్రసవించినట్లు చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.

Read Also: Brahmos Missile : బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష సక్సెస్.. ప్రకటించిన ఇండియన్‌ నేవీ

ఈ ఘటనలో పాప మృతి చెందిందని, పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా మైనర్ బాలికను వేధించిన యువకుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది. యూట్యూబ్‌లో సమాచారం తీసుకుని బాలికకు జన్మనిచ్చిందా లేక మరేదైనా ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

Exit mobile version