Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం నగర వాసులకు శుభవార్త. నగర నడిబొడ్డున ఉన్న సాలిగ్రామపురంలో ‘ఇన్ఆర్బిట్ మాల్’ అట్టహాసంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మాల్, ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మాల్‌లో షాపింగ్ ప్రియుల కోసం ఫ్యాషన్, పాదరక్షలు, నగలు, వాచీలు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలకు సంబంధించిన 350కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా షాపర్స్ స్టాప్, H అండ్ M, ప్యాంటలూన్స్, శామ్సంగ్, మలబార్ గోల్డ్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి.
సినిమా ప్రియుల కోసం ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఉంది. ఇందులో ముఖ్యంగా AAA (ఏషియన్ అల్లు అర్జున్) సినిమాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిల్లల కోసం 5 రకాల ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, రుచికరమైన ఆహారాన్ని అందించే ఫుడ్ కోర్ట్ , రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
Also Read:Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!
ఈ మాల్ కేవలం షాపింగ్ కోసమే కాకుండా.. ప్రజలు ఒకచోట చేరి సరదాగా గడిపేలా రూపొందించబడింది. వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 7 అంతస్తులను కేటాయించారు. అలాగే.. వ్యాయామం కోసం 1.1 కిలోమీటర్ల పొడవైన జోగింగ్ ట్రాక్, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ‘పెట్ పార్క్’, నగర అందాలను చూసేందుకు వీలుగా పైకప్పు మీద టెర్రస్ డెక్ ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా నిర్మించినందుకు ఈ మాల్‌కు ‘లీడ్ (LEED) గోల్డ్ సర్టిఫికేషన్’ లభించింది. అలాగే భద్రతా ప్రమాణాల విషయంలో బ్రిటిష్ కౌన్సిల్ నుండి అవార్డును కూడా అందుకుంది.
కె. రహేజా కార్ప్ ప్రతినిధులు నీల్ రహేజా, రజనీష్ మహాజన్ మాట్లాడుతూ.. విశాఖ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఈ మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఇది ప్రజలకు ఒక సరికొత్త జీవనశైలిని అందిస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?