NTV Telugu Site icon

Siddipet: సిద్దిపేట జిల్లాలో అమానుషం.. అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం..!

Baby Sale

Baby Sale

Siddipet: తెలుగు రాష్ట్రాల్లో శిశు విక్రయాల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్న నేటి రోజుల్లోనూ ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్నారు. నవమాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు ఏదో మూలకు బయటపడుతూనే ఉన్న.. ఈ ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయడం లేదు. అయితే తాజాగా అలాంటి అమానుష ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

Read Also: Toby: మారి ‘టోబీ’ అంటూ వచ్చేస్తున్న గరుడ గమన వృషభ వాహన టీమ్.. ఆ రోజే రిలీజ్!

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం రేపుతుంది. సిద్దిపేట అర్బన్ (మం) బూర్గుపల్లి గ్రామ శివారులో నిన్న ఉదయం పుట్టిన పసికందును 20 వేలకు విక్రయించే ప్రయత్నం చేసారు తల్లిదండ్రులు. గజ్వేల్ కి చెందిన ఓ కుటుంబంతో విక్రయ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాల రక్షక్ అధికారులు శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Vijaya Sai Reddy: వైసీపీ, బీజేపీ సంబంధాలపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా..?

మరోవైపు నిన్న ఉదయమే తల్లి శిశువు జన్మనిచ్చింది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ అయిన మహిళ.. హాస్పిటల్ సిబ్బందికి చెప్పకుండా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన బయటపడటంతో అధికారులు ఈ ఘటనపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా, శిశువును విక్రయించిన వారి ఆర్థిక పరిస్థితులు ఎలాంటివైనా శిశు విక్రయాలు జరపడం మాత్రం నేరం. గతంలో చాలా వరకు తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో శిశు విక్రయాలు ఎక్కువగా జరిగేవి.