NTV Telugu Site icon

Infosys : అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఆదాయం

Infosys

Infosys

Infosys : దేశంలోని 2వ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాన్ని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 15 నుంచి 16 శాతం మాత్రమే ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. అయితే అంచనాల కంటే 16 నుంచి 16.5 శాతం ఆదాయం పెరిగింది.

Read Also: 90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే

గత ఏడాది ఐటీ కంపెనీలు ఇబ్బంది పడినా ఇన్ఫోసిస్ మాత్రం గత రెండేళ్ల కంటే 30 శాతం అధికంగా 32 ఒప్పందాలను పొందింది. గత రెండేళ్లలో ఈ ఒప్పందాల విలువ 3.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.27వేల కోట్లు). 3వ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే 3వ త్రైమాసికంతో పోలిస్తే ఇది 13.4 శాతం ఎక్కువ. ఆదాయం విషయానికి వస్తే గతేడాది 3వ త్రైమాసికంతో పోలిస్తే 20.20 శాతం పెరిగి రూ.38 వేల 318 కోట్లకు పెరిగింది.

Read Also: Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు

క్యూ3లో ఇన్ఫోసిస్ TCS కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇన్ఫోసిస్ ఆదాయం, నికర లాభం ఊహించిన దాని కంటే మెరుగ్గా పెరిగింది ఇన్ఫోసిస్ రాబడి రూ. 37,963 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, నికర లాభం రూ. 6,465 కోట్లు… ఇన్ఫోసిస్ Q3 నికర లాభం అంచనాలకు మించి 13% పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది. ఉద్యోగుల టర్నోవర్‌ను నిరోధించడంలో ఇన్ఫోసిస్ కూడా క్యూ3లో టిసిఎస్‌ను అధిగమించింది. క్యూ2 నుంచి 21.5 శాతం క్షీణించిన టీసీఎస్ స్వల్పంగా మెరుగుపడింది. గత 2వ త్రైమాసికంలో ఇది 22 శాతంగా ఉంది.