Site icon NTV Telugu

Bomb Threat : ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

New Project (3)

New Project (3)

Bomb Threat : ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా పిల్లలను బయటకు తీశారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

Read Also:CM Revanth Reddy: నేడు జగిత్యాలలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో పాఠశాలలో బాంబు ఉందని రాసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు.

Read Also:Madhyapradesh : త్రిపుల్ రైడ్ బుల్లెట్ ఆపాలన్న కానిస్టేబుల్.. వీరంగం సృష్టించిన యువకులు

Exit mobile version