NTV Telugu Site icon

Infinix Smart 8 Plus Launch: ఇన్ఫీనిక్స్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, డైనమిక్ ఐలాండ్ ఫీచర్!

Infinix Smart 8 Plus

Infinix Smart 8 Plus

Infinix Smart 8 Plus Smartphone Launch in India: చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ ‘ఇన్ఫీనిక్స్‌’ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను భారతదేశంలో మార్చి 1 విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్‌ స్టోర్స్ సహా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ప్లస్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 4జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ వరకు వేరియెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇది ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుకవైపు ఇది నాలుగు-ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు విరాట్ కోహ్లీ డౌటే!

ఆపిల్ ఐఫోన్‌లో కనిపించే ‘డైనమిక్ ఐలాండ్’ని పోలి ఉండే ప్రత్యేక ఫీచర్‌ను ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. తాజా ఆండ్రాయిడ్‌ 13 యొక్క ప్రత్యేక వెర్షన్ ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ 6,000 ఎమ్‌ఏహెచ్‌ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంది. ఈ ఫోన్ ధర ఇంకా తెలియరాలేదు. ఇది నలుపు, తెలుపు మరియు గోల్డ్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.