Site icon NTV Telugu

7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్‌తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G!

Infinix Note Edge 5g

Infinix Note Edge 5g

Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ నోట్ ఎడ్జ్ 5G (Note Edge 5G)కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. గత నెల గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ఫోన్‌ను భారత్‌లో ఫిబ్రవరి 18న లాంచ్ చేయనుంది. ఈ డివైస్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా క్రికెటర్ ‘యశస్వి జైస్వాల్’ వ్యవహరించడం విశేషం.

డిస్‌ప్లే & డిజైన్:
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దాని స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్. ఇన్ఫినిక్స్ ప్రకారం ఇది తన సెగ్మెంట్‌లోనే అత్యంత సన్నని ఫోన్‌గా 7.78mm మందంతో వస్తోంది. వీటితోపాటు..
* 3D కర్వ్డ్ 1.5K AMOLED డిస్‌ప్లే
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ
*TUV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్
* డిజైన్ పరంగా ప్రీమియమ్ లుక్ ఇవ్వడానికి లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, సిల్క్ గ్రీన్ (వీగన్ లెదర్ ఫినిష్‌తో ప్రత్యేక డిజైన్) మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.

పనితీరు & హార్డ్‌వేర్:
ఈ కొత్త నోట్ ఎడ్జ్ 5Gలో MediaTek Dimensity 7100 చిప్‌సెట్‌ను వినియోగించారు. ఈ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్న భారత్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. అలాగే ఇది 7,50,000 పైగా AnTuTu స్కోర్, గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు “AI Powers Your Play” పేరిట ప్రత్యేక ఫీచర్లు అందిస్తున్నారు.

కెమెరా & బ్యాటరీ:
* 50MP మెయిన్ రియర్ కెమెరా
* 13MP ఫ్రంట్ కెమెరా
* 6500mAh భారీ బ్యాటరీ
* 45W ఫాస్ట్ ఛార్జింగ్
* 10W రివర్స్ ఛార్జింగ్
* దీంతో పాటు వెనుక భాగంలో RGB హలొ లైట్ నోటిఫికేషన్ లేదా స్టేటస్ ఇండికేటర్‌గా పనిచేస్తుంది.

ఆడియో & డ్యూరబిలిటీ:
* డ్యూయల్ స్పీకర్స్ విత్ జేబుల్ సౌండ్
* IP55 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ ప్రొటెక్షన్)

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G భారత్‌లో ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version