NTV Telugu Site icon

Infinix Note 30 5G Launch: 108MP కెమెరాతో వస్తున్న ఇన్ఫీనిక్స్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర 15 వేలు మాత్రమే!

Infinix Note 30 5g

Infinix Note 30 5g

Best 5g Smartphone under 15000: చైనాకు చెందిన ‘ఇన్ఫీనిక్స్‌’ మొబైల్ సంస్థ భారతదేశంలో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత మార్చిలో ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ని రిలీజ్ చేసింది. తాజాగా ‘ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30’ (Infinix Note 30 5G Launch)ని విడుదల చేసింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఈ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు జేబీఎల్ ఇన్-బిల్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. మంచి ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధర 15 వేల లోపే ఉండడం విశేషం.

Infinix Note 30 5G Price:
ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30 5G ధర 4GB + 128GB వేరియంట్‌కు రూ. 14,999లుగా ఉంది. 8GB + 256GB వేరియంట్‌కు రూ. 15,999లుగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్‌తో చెల్లింపుపై కంపెనీ రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఫోన్ బ్లాక్, ఆరెంజ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుంది. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.

Infinix Note 30 5G Specifications:
ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, సెల్ఫీ కోసం పంచ్-హోల్ కటౌట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC ద్వారా అందించబడుతుంది. ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30 ఫోన్ 8GB LPDDR4X RAM వరకు మరియు 256GB UFS3.1 వరకు స్టోరేజ్ ఉంటుంది. 8GB అదనపు వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. దాంతో మెరుగైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Also Read: India Head Coach: రాహుల్ ద్రావిడ్‌పై వేటు.. హెడ్ కోచ్ రేసులో ఐదుగురు! భారత్ నుంచి ఇద్దరు

Infinix Note 30 5G Camera:
ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30 ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ యూనిట్ మరియు AI లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP షూటర్ ఉంది. ఇది అద్భుతంగా సెల్ఫీలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది.

Infinix Note 30 5G Battery:
ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 30 ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కారణంగా ఎక్కువ గంటలు ఫోన్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, GPS/ GLONASS మరియు USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది.

Also Read: TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌! వైరల్ వీడియో

Show comments