NTV Telugu Site icon

IND Vs WI: టీమిండియా ఫస్ట్‌ బ్యాటింగ్‌.. తుది జట్లు ఇవే!

India Women

India Women

భారత్, వెస్టిండీస్‌ మహిళా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. వడోదర వేదికగా జరగనున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. స్మతీ మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లపైనే భారత్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. దీప్తి శర్మ, రేణుకా సింగ్, టిటాస్ సధులు బౌలింగ్ భారం మోయనున్నారు.

ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వన్డేలో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత్ భావిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో విండీస్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి విండీస్ 0-3తో ఓడిపోయింది. ఈసారి మరింత మెరుగ్గా ఆడాలని ఆశిస్తున్నారు.

తుది జట్లు:
భారత్: స్మతీ మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సైమా ఠాకూర్, టిటాస్ సధు, ప్రియా మిశ్రా, రేణుకా సింగ్.
వెస్టిండీస్‌: హీలీ మాథ్యూస్ (కెప్టెన్), క్వియానా జోసెఫ్‌, షెమైనే క్యాంప్‌బెల్లె (వికెట్ కీపర్), డాటిన్, రషాదా విలియమ్స్, జైదా జేమ్స్, అలియా అలీన్, షబికా గజ్నాబి, కరిష్మా, షమిలియా కానెల్, అఫీ ఫ్లెట్చర్.

Show comments