IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్ ఓటమి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Women won by 6 wkts vs India Women: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది. భారత్ నిర్ధేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆసీస్ మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం ముంబైలోనే జరుగుతుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులే చేసింది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలి వర్మ (1), జెమీమా రోడ్రిగ్స్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఆసీస్ పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి.. భారత్‌ను ఒత్తిడిలో నెట్టింది. ఈ సమయంలో ఈ స్థితిలో స్మృతి మంధాన (23) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. కాసేపటికే హర్మన్‌ప్రీత్ కౌర్ (6) కూడా వెనుదిరగడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థితిలో దీప్తిశర్మ (30; 27 బంతుల్లో 5×4).. రిచా ఘోష్ (23; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టింది. రిచా ఔట్ అయ్యాక ఇన్నింగ్స్ వేగం తగ్గిపోయింది. దీప్తి క్రీజులో ధాటిగా ఆడలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో.. భారత్ 130 పరుగులు చేసింది. కిమ్ గార్త్ (2/27), జార్జియా వేర్‌హామ్ (2/17), అనాబెల్ సదర్లాండ్ (2/18) తలో రెండు వికెట్స్ తీశారు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Also Read: IND vs AFG: కోహ్లీ, రోహిత్ వచ్చేశారు.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!
ఛేదనలో ఆస్ట్రేలియాపై ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్లు అలీసా హీలీ (26; 21 బంతుల్లో 4×4), బెత్ మూనీ (20) శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరిని దీప్తిశర్మ స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడంతో ఆసీస్ 9.1 ఓవర్లలో 58/2తో నిలిచింది. అయితే ఎలీస్ పెర్రీ (34 నాటౌట్; 21 బంతుల్లో 3×4, 2×6) దూకుడుగా ఆడి స్కోర్ వేగాన్ని పెంచింది. తాలియా (19), గార్డ్‌నర్ (7) స్వల్ప వ్యవధిలో ఔటైనా… లిచ్‌ఫీల్డ్ (18 నాటౌట్)తో కలిసి పెర్రీ పని పూర్తి చేసింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!