Indus Appstore: గూగుల్ ప్లేకు పోటీగా.. ఇండస్ యాప్‌స్టోర్! ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ యాప్ స్టోర్ ప్రారంభమైంది. ‘గూగుల్ ప్లే స్టోర్’కు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోర్‌ను ‘ఇండియా కా యాప్ స్టోర్’గా ఫోన్‌పే పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉంది. పెరుగుతున్న మొబైల్ వినియోగాన్ని మరింత వృద్ధి చేయాలనే ఆలోచనతో ఇండస్ యాప్‌స్టోర్‌ను ఫోన్‌పే లాంచ్ చేసింది. ఇది భారతీయ డిజిటల్ ప్రయాణంలో ఓ గొప్ప మార్పుగా ఫోన్‌పే పేర్కొంది. ఈ కొత్త యాప్‌ను వినియోగదారులు సమర్థవంతంగా వాడుకునేలా ఓ షార్ట్-వీడియోను సైతం ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌స్టోర్ అందుబాటులో ఉంటుంది. నచ్చిన భాషలో సెర్చ్ చేసి యాప్స్ పొందొచ్చు. ఈ యాప్‌స్టోర్ వినియోగాన్ని పెంచేలా పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతోనూ భాగస్వామ్యానికి ఫోన్‌పే ప్రయత్నిస్తోంది.
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
45 కేటగిరీలకు చెందిన 2 లక్షల మొబైల్ అప్లికేషన్లను తమ యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఫోన్‌పే చెబుతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేయడానికి 2025 ఏప్రిల్ 1 వరకు ఎలాంటి ఫీజూ ఉండదు. నచ్చిన థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేలు కూడా వాడుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలు, కమీషన్ విషయంలో స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఇండస్ యాప్‌స్టోర్‌ను లాంచ్ చేయడం గమనార్హం.
Also Read: Upcoming Smartphones 2024: అద్భుత ఫీచర్లతో.. త్వరలో లాంచ్ కానున్న టాప్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే!
ప్రస్తుతం ఇండస్ యాప్‌స్టోర్ యాప్ కంపెనీ వెబ్సైట్ indusappstore.comలో అందుబాటులో ఉంది. వెబ్సైట్లో ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి.. ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేయాలి. పర్మిషన్లు ఓకే చేశాక యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా.. లాగిన్ అవ్వొచ్చు. అనంతరం మీకు నచ్చిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!