NTV Telugu Site icon

CNG Price: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. అదనపు బాదుడు షురూ

Cng Price

Cng Price

CNG Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంలో పలువురు సీఎన్‌జీ వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్​జీ ధరను మరోమారు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్త గ్యాస్​ లిమిటెడ్(ఐజీఎల్​)​ ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం కారణంగా సీఎన్​జీ ధరలను పెంచినట్టు వివరించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్​జీ ధర రూ.79.56కి చేరింది.

Read Also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది

అటు నోయిడా, గ్రేటర్​ నోయిడా, ఘాజియాబాద్‌​లో కేజీ సీఎన్​జీ ధర రూ.82.12కి పెరిగింది. గురుగ్రామ్​‌లో కేజీ సీఎన్​జీ ధర రూ. 87.89గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌​లో కేజీ సీఎన్​జీ ధర ప్రస్తుతం రూ.95గా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ధర రూ. 3 పెరిగింది. దీపావళి పండుగకు ముందు అక్టోబర్‌లో సీఎన్‌జీ ధరలను పెంచారు. కాగా గ్యాస్ ధరలతో పాటు ఇప్పుడు సీఎన్​జీ ధరలు కూడా పెరగడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సీఎన్‌జీ ధరల పెంపుతో ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆటో ప్రయాణికులపై కూడా శనివారం నుంచి అదనపు ఛార్జీల భారం పడనుంది.