NTV Telugu Site icon

Madhya Pradesh : బిచ్చగాడికి బిచ్చం వేయడం కూడా తప్పేనా.. రూ.10 వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు

New Project (18)

New Project (18)

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో యాచకులకు భిక్ష ఇవ్వడంపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి లోకల్ ప్రభుత్వం భిక్ష ఇవ్వడం, తీసుకోవడం నిషేధించింది. దానిని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇండోర్‌ను దేశంలోనే మొట్టమొదటి ‘యాచక రహిత నగరం’గా మార్చడమే లక్ష్యంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, లాసుడియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఆలయం వెలుపల ఒక వ్యక్తి ఒక బిచ్చగాడికి రూ.10 ఇచ్చాడు. దీని తరువాత అధికార యంత్రాంగం యాచక నిర్మూలన బృందానికి ఫిర్యాదు నమోదు చేసి, డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఒక బిచ్చగాడికి డబ్బు ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం 15 రోజుల్లో ఇది రెండవ సంఘటన.

Read Also:Kishan Reddy: అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (BNS) సెక్షన్ 223 కింద ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు తెలిపారు. అంతకుముందు, జనవరి 23న, ఖాండ్వా రోడ్డులోని ఒక ఆలయం దగ్గర ఒక భిక్షగాడికి భిక్ష ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత ఆరు నెలల్లో నగరంలోని 600 మందికి పైగా యాచకులను పునరావాసం కోసం షెల్టర్ హోమ్‌లకు పంపినట్లు ఇండోర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. వీరిలో దాదాపు 100 మంది పిల్లలను పిల్లల సంరక్షణ సంస్థలకు పంపారు. ఈ యాచకులలో చాలా మంది బెలూన్లు, ఇతర వస్తువులను అమ్మే నెపంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడుక్కుంటూ కనిపించారు.

Read Also:South Coastal Zone: ఏపీకి షాక్ ఇచ్చిన రైల్వేశాఖ.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కొత్త మెలిక..!

ఇండోర్ పరిపాలన యాచించడం, భిక్ష ఇవ్వడం, యాచకుల నుండి వస్తువులు కొనడంపై చట్టపరమైన నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ దశలో భాగంగా యాచకులకు పునరావాసం కల్పించడానికి కూడా పరిపాలన కృషి చేసింది. భోపాల్‌లో కూడా యాచకులకు డబ్బు ఇవ్వడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రచారం కింద బిచ్చగాళ్లకు డబ్బు ఇచ్చే బదులు, అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిక్షాటన నిర్మూలన బృందం సమాచారం అందించిన వారికి రూ. 1000 బహుమతిని కూడా ప్రకటించింది. ఇండోర్ పరిపాలన లక్ష్యం భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి, దానిని యాచకులు లేని నగరంగా మార్చడం. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.