NTV Telugu Site icon

largest flower : ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు

World Largest Flower (2)

World Largest Flower (2)

largest flower : సార్మ్ ఫోన్ దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచమంతా మన ముందు ఆవిష్కారమవుతున్న రోజులివి. ప్రపంచంలో ఏ మూల వింత కనిపించినా తక్షణమే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే ప్రకృతిలో దాగి ఉన్న విచిత్రాలను మనం రోజు చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమాని వాటిని మన ముందుకు తెచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇతను ఓ ట్రెక్కర్.. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పాన్ని చూసి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా రాఫ్లేసియా ఆర్నాల్డి ప్రసిద్ధి చెందింది. ఈ పువ్వును దాటి మరే పువ్వు లేదు. అలాంటి దానిని ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇప్పటి వరకు వరల్డ్ లార్జెస్ట్ ఫ్లవర్ గా ఇది రికార్డుల్లో ఉంది. రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రపంచంలోనే అతి అరుదైన జాతికి చెందిన పుష్పంగా  పేరు గాంచింది. ఇది కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే వికసించి ఉంటుంది. ఇది మూడు అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. 15 పౌండ్ల బరువు ఉంటుంది.

ఇది ప్రపంచంలో ఉండే అరుదైన పుష్పాలలో ఒకటిగా పేరు గాంచింది. సోషల్ మీడియాలో ఈ రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం వీడియో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన అనేక మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పుష్పం గ్రహంతర వాసుల నుంచి వచ్చిందా? అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వారు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.