Site icon NTV Telugu

Indonesia floods: ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు.. 37 మంది మృతి

Ieke

Ieke

ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతిచెందగా. నలుగురు గల్లంతయ్యారు. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా మరో 18 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది.

భారీ వర్షం కారణంగా ఇండోనేషియాలోని పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మరో 18 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం.. ఓటమికి కారణమదే..!

శనివారం నుంచి వరదలు ముంచెత్తినట్లుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వరదలు కారణంగా భారీగా బురద చేరిందని తెలిపింది. దాదాపు ఐదు జిల్లాలపై ప్రభావం చూపించిందని చెప్పింది. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం.. పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. ఎంత నష్టం జరిగింది అన్నదానిపై అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు.

ఇదిలా ఉంటే ఆప్ఘనిస్తాన్‌ను కూడా మెరుపు వరదలు ముంచెత్తాయి. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..

Exit mobile version