Indiramma Amrutam : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో, కౌమార బాలికలలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ‘‘ఆడపిల్లలకు శక్తినిద్దాం… ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’’ అనే నినాదంతో ‘‘ఇందిరమ్మ అమృతం’’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి బాలికకు నెలకు 30 చిక్కీలు ఇవ్వబడతాయి. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీల శక్తి, 18–20 గ్రాముల ప్రొటీన్లు, అవసరమైన మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి.
Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 50,269 బాలికలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్న నేపథ్యంలో, ఈ పథకం ప్రాధాన్యతను సంతరించుకుంది. పథకాన్ని అధికారికంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఈ కార్యక్రమం ద్వారా పోషకాహారంపై అవగాహన, బాల్య వివాహాల నివారణ, జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు కూడా అందించనున్నారు.
Babylon Pub : బేబిలాన్ పబ్‌లో దారుణ ఘటన.. లైట్స్ ఆపి తన తల్లి, చెల్లిని…
