NTV Telugu Site icon

Indigo Flight: ఇండిగో ఫ్లైట్‌ ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం

Flight

Flight

Indigo Flight: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు, సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా నిలిపివేశారు. సమస్యను గుర్తించి వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో విమానంలో 184 మంది ఉన్నారు. 177 మంది ప్రయాణికులు కాగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

Shiva Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం.. నేడే ప్రారంభం

ఇండిగో విమానం 6E-2131లోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌బస్ ఏ-320 విమానంలో 184 మంది ఉన్నారు. ప్రయాణీకులలో ఒకరైన ప్రియాంక కుమార్, ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇందులో ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కనిపిస్తుంది. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులను వెంటనే బయటకు తీసుకురాలేదు. ప్రయాణికులను రాత్రి 11 గంటల తర్వాత విమానం నుంచి దిగి అర్ధరాత్రి సమయంలో మరో విమానంలో తరలించారు. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. ప్రయాణీకులకు కలిగించిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలిపింది. టేకాఫ్ రోల్ సమయంలో సాంకేతిక లోపంతో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు తెలిపింది.