Site icon NTV Telugu

Indigo Flight: ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. ఢిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్

Indigo

Indigo

Indigo Flight: ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది. మరోవైపు ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు సేఫ్ గా టేకాఫ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: BoyapatiSuriya: రోలెక్స్ నట విశ్వ రూపం.. రక్త చరిత్రే..?

“ఇండిగో విమానం ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వెళ్లే క్రమంలో సాంకేతిక సమస్య కారణంగా తిరిగి వచ్చింది. పైలట్ విమానంలో సమస్యను గుర్తించి ATCకి సమాచారం అందించాడు. అనంతరం అత్యవసర ల్యాండింగ్‌ కావాలని కోరాడు. ఆ తర్వాత విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అవసరమైన నిర్వహణ తర్వాత తిరిగి ఆపరేషన్‌లో ఉంటుంది” అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు విమానంలో మంటలు చెలరేగినట్లు వచ్చిన వార్తలను ఎయిర్‌లైన్స్ తోసిపుచ్చింది. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ సంఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

Exit mobile version