Site icon NTV Telugu

IndiGo Flight Cuts: ఇండిగోకు కేంద్రం గట్టి షాక్‌.. 10% విమాన సర్వీసులు కట్ చేస్తూ ఆర్డర్!

Indigo

Indigo

IndiGo Flight Cuts: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్ర అంతరాయానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యకలాపాలు వరుసగా దెబ్బతింటుండటంతో కేంద్రం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మొత్తం 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని ఇండిగో సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా హాజరయ్యారు. అలాగే ఇండిగో తరఫున సీఈఓ పీటర్ ఎల్బర్స్ పాల్గొన్నారు.

READ ALSO: Akhanda 2: షాకింగ్.. అఖండ 2 రిలీజ్ 12న కూడా లేనట్టేనా?

10% సర్వీసులు తగ్గించుకోవాలి..
ఇండిగో ప్రస్తుతం దేశీయ రూట్లలో నిర్వహిస్తున్న వేల సంఖ్యలో విమాన సర్వీసుల్లో కనీసం 10 శాతం సర్వీసులను తాత్కాలికంగా తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. పైలట్లు, క్రూ సభ్యులు, టెక్నికల్ సిబ్బందిపై అధిక ఒత్తిడి పడకుండా, ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని, వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

పైలట్లు, క్రూ సభ్యుల పని గంటలను నియంత్రించే FDTL ఫేజ్–2 ను పాటించడంలో ఇండిగో విఫలమైందనే ఆరోపణల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత ఉధృతమైందని అధికారులు గుర్తించారు. దీంతో ఇండిగో విధానాలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇండిగోలో చోటుచేసుకున్న ఈ వ్యవస్థాత్మక లోపాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ముఖ్యంగా FDTL అమలు, మానవ వనరుల వినియోగం, కార్యకలాపాల ప్లానింగ్, డ్యూటీ రోస్టర్ల నిర్వహణ వంటి కీలక అంశాలు ఈ విచారణ పరిధిలోకి రానున్నాయి. ఇండిగో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ సంస్థకు పరోక్షంగా కఠిన హెచ్చరికలు జారీ చేసినట్టు పలు వర్గాలు చెబుతున్నాయి. సేవల నాణ్యత క్షీణించకూడదు, ప్రయాణికుల భద్రతతో రాజీపడకూడదని స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

READ ALSO: Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!

Exit mobile version