NTV Telugu Site icon

IND vs SL: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రీలంక స్కోరు..?

Ind Vs Sl

Ind Vs Sl

భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంతో తక్కువ స్కోరు చేయగలిగింది. దీంతో భారత్ ముందు శ్రీలంక స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (67), పతుం నిస్సాంకా (56), హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో.. శ్రీలంక 200 పరుగులు దాటింది. ఒకానొక సమయంలో వికెట్లు కోల్పోయి.. తక్కువ స్కోరు ఉన్న క్రమంలో, ఓపెనర్ నిస్సాంకా నిలకడగా ఆడాడు. ఆ తర్వాత.. వెల్లలాగే కూడా చివరి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును పెంచాడు. వీరిద్దరూ బ్యాటింగ్ చేయడం వల్లే శ్రీలంక స్కోరు 200 పరుగులు దాటింది.

Read Also: Bigg Boss Telugu 8 Teaser: ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు!

శ్రీలంక బ్యాటింగ్లో నిస్సాంకా 75 బంతులు ఆడి 56 రన్స్ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉన్నాయి. వెల్లలాగే ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 2 సిక్సులు, 7 ఫోర్లు సాధించాడు. జనిత్ లియాంగే (20), హసరంగ (24), అఖిలా ధనుంజయ (17), చరిత్ అసలంక (14), కుశాల్ మెండీస్ (14) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. మహమ్మద్ సిరాజ్, శివం దూబె, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ చొప్పున పడగొట్టారు.

Read Also: Mid-Air Flight: నాతో సె*క్స్ చేస్తావా లేదా ఫ్లైట్ డోర్ ఓపెన్ చేయమంటావా..? మహిళా సిబ్బందిపై అసభ్య ప్రవర్తన..

Show comments