బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈ నెల 26 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. అయితే.. బాక్సింగ్ డే టెస్టు విషయానికొస్తే.. భారత్ రికార్డు చెప్పుకోదగినంత లేదు.. ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. బాక్సింగ్ డే టెస్టు ప్రత్యేకం.
Read Also: Honda-Nissan: హోండా, నిస్సాన్ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్?
బ్యాట్స్‌మెన్‌లలో ఎవరు బెస్ట్..?
బాక్సింగ్ డే టెస్టులో భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ నుండి వచ్చాయి. 2003లో మెల్‌బోర్న్‌లో 223 బంతుల్లో 195 పరుగులు చేశాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ 2014లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే మ్యాచ్‌లో అజింక్య రహానే కూడా 147 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
బాక్సింగ్ డే టెస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా హీరో..
బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 2013 డర్బన్‌లో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా 128 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు..
18 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 11 మ్యాచ్ ల్లో ఓడిపోగా, 3 మ్యాచ్ లు డ్రా అయ్యాయి.