Site icon NTV Telugu

Indian Railways Pamban Bridge: 81 శాతం పూర్తయిన భారత్ తొలి వర్టికల్ సీ బ్రిడ్జి

Pamban

Pamban

భారతదేశపు తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్. ఈ బ్రిడ్జి త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకుంటోంది. భారతదేశ ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలుపుతోంది పంబన్ వంతెన. దీని పనులు వేగంగా జరుగుతున్నాయని ఇండియన్ రైల్వేస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే 81 శాతం పని పూర్తయింది. పైలింగ్ వర్క్ లో భాగంగా మొత్తం 333 పైల్స్ పూర్తయ్యాయి. పైల్ క్యాప్ & సబ్ స్ట్రక్చర్ లో భాగంగా మొత్తం 101 పూర్తయ్యాయని రైల్వే ట్వీట్ చేసింది. అలాగే 99 గిర్డర్లలో 76 పూర్తయ్యాయని తెలిపింది.

దేశంలో కీలక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచడానికి రైల్వే శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాశ్మీర్ తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిడ్జిలు నిర్మిస్తోంది. ఈ వర్టికల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైల్వే ద్వారా మరింత వేగవంతమయిన సేవలు అందించే అవకాశం వుంటుంది. పాసింజర్, గూడ్స్ రైళ్ళ వేగం పెంచుకోవచ్చు. ఈ బ్రిడ్జి కింద నుంచి షిప్ లు, స్టీమర్లు కూడా సులువుగా ప్రయాణించే వీలుంటుంది.

పంబన్ ప్రాంతంలో పాత వంతెన గతంలోనే ప్రారంభించబడింది. అయితే, తాజాగా వర్టికల్ వంతెన నిర్మిస్తున్నారు. పంబన్ ద్వీపానికి, రామేశ్వరం పట్టణాన్ని ఇది కలుపుతుంది. భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధిపై ఉంది. గతంలో వున్న రోడ్డు, రైలు వంతెన 1914 లో ప్రారంభించబడింది.ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తైంది. పంబన్ లో వున్న రోడ్డు కం రైలు వంతెన 6,776 అడుగులు అంటే 2,065 మీటర్లు పొడవు కలిగి ఉంది. దీనిని 1914 లో ప్రారంభించారు. రైలు మార్గం వంతెన డబుల్-లీఫ్ బేస్కూల్ వంతెన. ఇది ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చేవిధంగా వెసులుబాటు ఉంటుంది.

Exit mobile version