NTV Telugu Site icon

India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..

India North Korea

India North Korea

India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. ఉత్తర కొరియా చాలా అస్పష్టతతో పనిచేస్తున్న కారణంగా, భారత్ ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించింది. జూలై 2021లో భారతదేశం ఉత్తర కొరియాతో తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. రాయబారి అతుల్ మల్హరీ గోట్‌సర్వేతో పాటు మొత్తం సిబ్బందిని మాస్కో మీదుగా ఢిల్లీకి తరలించారు.

అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంబసీని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మొత్తం సిబ్బందిని వెనక్కి పిలిపించింది. కోవిడ్ -19 కారణంగా ఈ చర్య తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. 14 నెలల క్రితం గోట్‌సర్వేని మంగోలియాకు కొత్త రాయబారిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో భారతదేశం ప్యాంగ్యాంగ్‌తో తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే సాంకేతిక సిబ్బంది, దౌత్య సిబ్బందిని ఉత్తర కొరియాకు పంపబడింది.

Read Also: Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!

ఒక నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గూఢచర్యంలో కిమ్ ప్రభుత్వం ప్రసిద్ధి. దీంతో రాయబార కార్యాలయంలోని ప్రతీ ఇంచు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా క్షిపణి అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాలు, షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. ఉత్తర కొరియాలో భారత ఉనికి ఉండటం వల్ల ఇలాంటి సాంకేతికత పాకిస్తాన్ వంటి దేశాలకు చేరకుండా అడ్డుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా రష్యా, చైనా, ఇరాన్‌లతో సంబంధాలను పెంచుకుంది. ఈ కూటమి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాల క్వాడ్ కూటమిని కౌంటర్ చేయడానికి ఏర్పడింది. దౌత్యపరంగా దీనిని ఎదుర్కోవడానికి భారతదేశాని ప్రాధాన్యత ఉంటుంది. రష్యా, ఇరాన్‌తో భారత్‌‌కి ఉన్న బలమైన సంబంధాలు కూడా ఉత్తర కొరియా విషయంలో భారత్‌కి సహాయపడనున్నాయి.

Show comments