Site icon NTV Telugu

Team India: ఫైనల్లో ఇండియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు

Loss

Loss

వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండి.. టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు కన్నీటిపర్యంతం అయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకునేందుకు తలదించుకుని మైదానం నుంచి బయటికి వచ్చేశాడు.

మరోవైపు.. మహ్మద్ సిరాజ్ కూడా మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. సిరాజ్ ను బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఓదార్చడం కనిపించింది. ఏదేమైనా, వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి, ఫైనల్లో ఓడిపోవడం టీమిండియా ఆటగాళ్లను తీవ్ర వేదనకు గురిచేసింది. టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోపై కొందరు క్రీడాభిమానులు, క్రికెట్ లవర్స్ స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలా చూడలేం దయచేసి ఏడవకండి’ అని ట్విట్టర్ వేదికగా కొందరు రోహిత్‌ను ఓదారుస్తుండగా.. ఇంకొందరేమో ‘చేయాల్సిదంతా చేసి ఇక ఏడుపెందుకు బ్రో..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమే ‘అంతా విధి రాత ఏం చేయగలవు రోహిత్.. విరాట్.. కూల్ కూల్‌’ అని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. సాధారణ ప్రేక్షకుడికే ఎంతో బాధ ఉంటే.. ఇక ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది.

Exit mobile version