India’s Biggest Digital Arrest Scam: గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
READ MORE: Su-57 fighter jets: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. Su-57 వస్తే పాక్, చైనాలకు మూడినట్లే..
వృద్ధుడైన నరేష్ మల్హోత్రాకు దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు. నరేష్‌కి నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. మాజీ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు, ఎయిర్‌టెల్ ప్రధాన కార్యాలయం పేరుతో ఒక మహిళ కాల్ చేసింది. తన ల్యాండ్‌లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆమె చెప్పింది.
READ MORE: Girls Eloping: ఈ జిల్లా నుంచి పారిపోతున్న అమ్మాయిలు.. ఒక్క నెలలో 164 కేసులు.. షాక్ అవుతున్న పోలీసులు
NIA చట్టం కింద అరెస్టు చేస్తున్నట్లు నరేష్‌ని భయపెట్టింది. సాయంత్రం మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. మేము మిమ్మల్ని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఆ వృద్ధుడికి ఓ వీడియో కాల్ వచ్చింది. మెహతా అనే వ్యక్తి ఫోటో చూపించారు. అతను సహకార బ్యాంకును రూ. 1300 కోట్లు మోసం చేశాడని, ఈ డబ్బును పుల్వామా కేసులో ఉగ్రవాద నిధుల కోసం ఉపయోగించారని వీడియో కాల్‌లో మహిళ చెప్పింది. నరేష్ మల్హోత్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు దోచేసింది ఆ మహిళ. తరువాత నరేష్ మల్హోత్రాపై నకిలీ చార్జిషీట్ తయారు చేసి పంపారు. ప్రతి రెండు గంటలకు తనను విచారిస్తామని ఆమె చెప్పింది. ఇది సీక్రెట్స్ యాక్ట్. మీరు ఎవరితోనూ మాట్లాడ కూడదు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే, మనీలాండరింగ్ నిరోధక ఆరోపణల కింద మిమ్మల్ని అరెస్టు చేస్తారని అని బెదిరించారు. ఇలా నెల రోజులు నిర్బంధంలో ఉంచారు. సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు, ఆర్బీఐ పేర్లు వాడుకుని విడతల వారీగా దాదాపు రూ. 23 కోట్లు కొట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. రూ. 12.11 కోట్లను స్తంబింపజేశారు.
